Posts

Showing posts with the label Telegu Christmas Songs

chintha ledika yesu puttenu చింత లేదిక యేసు పుట్టెను

Image
పల్లవి: చింత లేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లెహేమందున చెంతజేరను రండి సర్వజనంగమా - సంతస మొందుమా ...చింత... 1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి - స్తుతు లొనరించిరి ...చింత... 2. చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి - కానుక లిచ్చిరి ...చింత... 3. కన్య గర్భమునందు బుట్టెను - కరుణ గల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై - సర్వమాన్యులై ...చింత... 4. పాప మెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము - మోక్షభాగ్యము

ambaraniki antela అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల

Image
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని 1. ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి (2), విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2), 2. దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి (2), పరముకు నడిపించే మార్గము చూపించే (2), 3. సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి (2), ఇలలో నశియించే జనులను ప్రేమించే (2),

sheethakalamlo christmas kanthulatho శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో ఓహోఓహోఓహోఓహో

Image
ఓహో...ఓహో...ఓహో...ఓహో... ॥4॥ శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో జనియించిన శ్రీ యేసుని నీడలో ॥2॥ చీకు లేదు చింతా లేదు చాలా సంతోషం బాధాలేదు భయము లేదు భలే ఆనందం ॥2॥ *హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్*॥2॥ ॥శీతాకాలంలో॥ 1. యాకోబులో నక్షత్రం ఉదయించెను తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను ॥2॥ బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చెను నాడు ఆరాధించి ఆనందించి ॥2॥ యేసుని చాటెనుచూడు *హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్*॥2॥ ॥శీతాకాలంలో॥ 2. పొలమందు కాపరులకు దూత చెప్పెను రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు ॥2॥ పశువుల తొట్టిలో ప్రభువును చూచి పరవశమొందిరి వారు కని విన్నవాటిని ప్రచురము చేసి ॥2॥ మహిమ పరచెను చూడు *హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్*॥2॥ ॥శీతాకాలంలో॥

sudhaa madhura kiranaala arunodayam సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని

Image
సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2) 1. దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) 2. లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సహపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)