Posts

Showing posts with the label Telegu Christian Songs

mahonnathuda nee chaatuna ne nivasinchedhanu మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను

Image
[Verse 1] మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను [Pre-Chorus1] బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము [Chorus] యేసయ్యా యేసయ్యా [Verse 2] రాత్రివేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్లా వేధించు వ్యాధికైనా [Pre-Chorus2] నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే [Chorus] యేసయ్యా యేసయ్యా [Verse 3] వేయిమంది నా ప్రక్క పడిపోయినా పదివేలు నా చుట్టు కాలినను అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా [Pre-Chorus3] నే భయపడను నే దిగులు చెందను యెహోవా నిస్సి నా తోడు నీవే [Chorus] యేసయ్యా యేసయ్యా [Bridge1] నిను ప్రేమించువారిని తప్పించువాడా నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా [Bridge2] నా యుద్ధము జయించి లేవనెత్తువాడా కృప వెంబడి కృప చూపించువాడా [Chorus] యేసయ్యా యేసయ్యా [Tag] నే భయపడను నే దిగులు చెందను యెహోవా షాలోం నా తోడు నీవే

galaleeya teerana chinna nava గలిలయ తీరాన చిన్ననావ

Image
గలిలయ తీరాన చిన్ననావ యేసయ్య ఏర్పరచు కున్ననావ యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా 1॰ యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించినా ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసినా ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా 2॰ సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెనుతుఫానులెన్నో అడ్లోచ్చినా ఆగకుండా ముందుకే కొనసాగినా అలుపెరుగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా

amarudavu neevu naa yesayya aadhiyu anthamu neevenayyaa అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా

Image
అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక – సాగిపోదును సీయోను మార్గములో స్తోత్ర గీతము – ఆలపింతును నీ దివ్య సన్నిధిలో శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధం లోకమంతయు – దూరమైనను – నను చేరదీసెదవు దేహమంతయు – ధూళియైనను – జీవింపజేసెదవు వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను కన్న తండ్రిగ – నన్ను కాచి – కన్నీరు తుడిచితివి కమ్మనైన – ప్రేమచూపి – కనువిందు చేసితివి జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మ దీపము – వెలిగించినావు – నీకే ఆరాధన

sudhooramu ee payanamu mundu iruku maargamu సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము

Image
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||

gaganamu cheelchukoni ghanulanu theesukoni గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని

Image
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానై యున్న నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది 1.నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను నీ కౌగిలిలో నేను విశ్రమింతును... 2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది మర్మమైయున్న నీవలే రూపించుచున్నది కళంకము లేని వధువునై నిరీక్షణతో నిను చేరెదను యుగయుగాలు నీతో ఏలేదను... 3.నీ కృపా బాహుళ్యామే ఐశ్వర్యం ఇచ్చినది తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనుందును.

sharonu vanamulo pusina pushpamai షారోను వనములో పూసిన పుష్పమై లోయ

Image
షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లిపద్మమునై నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు ఆనందమయమై నన్నె మరిచితిని 1. సుకుమారమైన వదనము నీది - స్పటికము వలె చల్లనైన హృదయము నీది మధురమైన నీ మాతల సవ్వడి వినగా - నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె ప్రభువా నిను చెరనా !!షారోను!! 2. సర్వొన్నతమైన రాజ్యము నీది - సొగసైన సంబరాల నగరము నీది న్యాయమైన నీ పాలన విధులను చూడగా - నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే ప్రభువా నిన్ను మరతునా !!షారోను!! 3. సాత్వికమైన పరిచర్యలు నీవి - సూర్యకాంతిమయమైన వరములు నీవి పరిమలించు పుష్పమునై చూపనా - ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా ప్రభువా కృపతో నింపుమా !!షారోను!!

deva nee aavaranam maakento sreyaskaram దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం

Image
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక ఘడియా యిచట గడుపుట మేలు వేయి దినములకంటేను 1. అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో ఆల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవు ఆనందించగ నీ మదిలో #దేవా# 2. అత్యంత పరిషుద్ధమౌ ఆ…. నీడుగూడారమున ఆ….. నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితీవి నీ దయన్ జు౦టి ధారల కన్నాను తేనె మధురిమ కన్నాను శ్రేష్టమౌ నీదువాక్కులచేత- మము తృప్తి పరచుమయా #దేవా# 3. పరిషుద్ద సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం ప్రాణ ప్రియుడవు పదముల చేరి – ప్రాణార్పణము జెతుము#దేవా#

sakthimanthuda sarvonathuda sarvasrustike శక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వసృష్టికే గొప్ప ప్రభువా

Image
పల్లవి శక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వసృష్టికే గొప్ప ప్రభువా {2} అను పల్లవి: నన్ను నన్నుగా ప్రేమించినా నమ్మకమైన నా యేసయ్య {3} మహిమా నీకే మహిమా మహోన్నతుడా నీకే మహిమా{4} 1చరణం: జీవాన్ని పోసిన జీవాధిపతివి జీవితాన్ని ఇచ్చిన జ్యోతిర్మయుడివి{2} 2చరణం: పరమునే విదచిన పరలోకతన్ద్రివి పాపాన్ని క్షమించిన పరిశుద్ధుడివి{2}

naa praanamaa sannuthinchumaa నా ప్రాణమా సన్నుతించుమా

Image
నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును (2) అంతరంగ సమస్తమా సన్నుతించుమా (2) ||నా ప్రాణమా|| ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2) దీర్ఘ శాంత దేవుడు నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా|| మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2) దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా||

ninne ninne ne koluthunayya నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

Image
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా ॥2॥ యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥ 1॰ కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా ॥2॥ నన్ను నడిపించినావా ॥యేసయ్యా॥ 2॰ ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా ॥2॥ నా కొండ నీవే యేసయ్యా ॥యేసయ్యా॥ 3॰ మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా ॥2॥ నిన్నే ఘనపరతునయ్యా ॥యేసయ్యా॥ 4॰ వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటానా కలలా కడతేర్చినావా ॥2॥ నీ వలలో నను మోసినావా ॥యేసయ్యా॥

parishudha parishudha prabhuva పరిశుద్ద పరిశుద్ద ప్రభువా

Image
పరిశుద్ద పరిశుద్ద ప్రభువా పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువా వర దూత-లైన నిన్ వర్నింపగలరా (2) 1. పరిశుద్ద జనకుడ పర-మాత్మ రూపుడ (2 ) నిరుపమ బల-బుద్ది నీతి ప్రభవా 2. పరిశుద్ద తనయుడ నర రూప ధారుడ (2 ) నరు-లను రాక్షించు కరుణా సముద్రా 3. పరిశుద్ద మగు నాత్మ వర ము-లిడు నాత్మ (2) పర-మానంద ప్రేమ భక్తుల కిడుమా 4. జనక కుమరాత్మ లను నెక దేవ (2) ఘన మహిమ చెల్లును దనరా నిత్యముగా

nee mukhamu manoharamu lyrics నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము

Image
నీ ముఖము మనోహరము - నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై "యేసయ్య" 2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై – నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు "యేసయ్య" 3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై – నను మైమరచి నేనేమి చేసేదనో "యేసయ్య"

naa chinni hrudayamutho నా చిన్ని హృదయముతో

Image
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగుచేయమని కోరెదన్ (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును (2) మన్నైన నేను మహిమగ మారుటకు నీ మహిమను విడచితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే (2) నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయూ (2) నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని (2) హోసన్న హోసన్నా యూదుల రాజుకే హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

sathakoti vandhanaalu na yesayya శతకోటి వందనాలు నా యేసయ్యా

Image
శతకోటి వందనాలు నా యేసయ్యా గతమంత నీ కృపలో కాచితివయ్యా నూతన బలము నూతన శక్తి మా కొసగుమయ్యా ఎనలేని నీ ప్రేమను మాపై చూపించుమయ్యా శ్రమలు శోధనలు ఇరుకు ఇబ్బందులు ఎన్నెన్నో కలిగి కన్నీరు విడిచిన కన్నీరు నాట్యముగ మార్చివేసినావు మాతోడు నీవై నడిపించినావు ఆత్మీయ యాత్రలో అలసిపోయిన నీ శక్తితో నింపి బలపరచినావు పక్షిరాజువలె నన్ను పైకెగరజేసి ఆకాశవీధిలో విహరింపజేశావు దినములు జరుగుచుండగ నీ కార్యములు నూతనపరచుము నా యేసయ్యా ఈ సమయములో మెండైన దీవెనలు కురిపించుమయా కృపగల దేవా

vandanam yesayya vandhanam yesaiah|| వందనం యేసయ్యా వందనం యేసయ్యా

Image
నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4) ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2) ||వందనం|| బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||

nenellappudu yehovanu sannuthinchedan నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్

Image
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| చదువులే రాకున్నా – ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపు...

stuthi paadutake brathikinchina స్తుతి పాడుటకే బ్రతికించిన

Image
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ: దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై

entha manchi devudavayya ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవయ్యా

Image
ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా - 2 1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2 2. నాకున్న వారందరూ - నను విడచి పోయిననూ నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా - 2 3. నువ్ లేకుండా నేను - ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి - పరలోకం చేరెదనేసయ్యా - 2

raja nee sannidhilone రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

Image
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య