Posts

Showing posts with the label Telengu Christian Songs

ella nin krupeye ಎಲ್ಲಾ ನಿನ್ ಕೃಪೆಯೆ

Image
ಎಲ್ಲಾ ನಿನ್ ಕೃಪೆಯೆ ಎಲ್ಲಾ ನಿನ್ ಕೃಪೆಯೆ ನಾನಿರುವುದು ನಿನ್ ಕೃಪೆಯೇ ನಾ ಉಳಿದಿರುವುದು ನಾಶವಾಗದಿರುವದು ಅಪ್ಪಾ ನಿನ್ನ ಕೃಪೆಯೇ || ಯೇಸಪ್ಪಾ ಎಲ್ಲಾ ನಿನ್ ಕೃಪೆಯೇ ಯೇಸಪ್ಪಾ ಎಲ್ಲಾ ನಿನ್ ದಯೆಯೇ || ನಾನು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಏನು ಇಲ್ಲಪ್ಪಾ ಎಲ್ಲಾ ನಿನ್ನ ಕೃಪೆಯೇ || ಎಲ್ಲಾ ನಿನ್ || ಪಾಪಿಯಾದ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದು ಎಲ್ಲಾ ನಿನ್ನಾ ಕೃಪೆಯೇ ನಾಶನದ ಗುಂಡಿಯಿಂದ ಮೇಲೆತ್ತಿದ್ದು ಎಲ್ಲಾ ನಿನ್ನಾ ಕೃಪೆಯೇ || ನಿನ್ನ ಪರಿಶುದ್ಧ ರಕ್ತದಿಂದ ನನ್ನ ತೊಳೆದದ್ದು ಅಪ್ಪಾ ನಿನ್ನ ಕೃಪೆಯೇ ನಿನ್ನ ಮಹಿಮೆಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ನನ್ನ ಸೇರಿಸಿದ್ದು ಅಪ್ಪಾ ನಿನ್ ಕೃಪೆಯೇ || ಎಲ್ಲಾ ನಿನ್ || ಬಲವಿಲ್ಲದಿರುವಾಗೆಲ್ಲ ಬಲಪಡಿಸಿದ್ದು ಎಲ್ಲಾ ನಿನ್ನಾ ಕೃಪೆಯೇ ಈವರೆಗೂ ಕಾದು ನನ್ನ ನಡೆಸುತ್ತಿರುವುದು ಎಲ್ಲಾ ನಿನ್ನಾ ಕೃಪೆಯೇ || ನನ್ನ ಹೆಚ್ಚಿಸಿ ವೃದ್ಧಿಸಿ ಆಶೀರ್ವದಿಸಿದ್ದು ಅಪ್ಪಾ ನಿನ್ನಾ ಕೃಪೆಯೇ ನನ್ನ ಪೋಷಿಸಿ ರಕ್ಷಿಸಿ ಜೊತೆಗಿರುವುದು ಅಪ್ಪಾ ನಿನ್ನಾ ಕೃಪೆಯೇ | ಎಲ್ಲಾ ನಿನ್ |

nenu naa illu naa inti vaarandaru నేను నా ఇల్లు నా ఇంటి వారందరు

Image
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2) నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||

naa yesu raajaa sthothramu నా యేసు రాజా స్తోత్రము

నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము నే జీవించుదాక ప్రభు కరుణాసంపన్నుడా బహు జాలిగల ప్రభువా దీర్గశాంతం ప్రేమా కృపయు నిండియుండు ప్రభువా స్తుతి ఘన మహిమలెల్ల నీకే చెల్లింతుము ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి ఆరాధనా చేసెదం పిలచెడి వారికెల్ల దరిలో నున్నవాడా మనసార పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చువాడా

calvary giri nundi pilachina na yesu కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు

కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణమును గెలిచిన నా యేసు హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా 1. మధుర ప్రేమను చూపించి నాపై - మదిని నెమ్మది చేకూర్చినావు మారని యేసురాజా - మరువను నిన్ను దేవా 2. బెదరి బ్రతుకున నే చెదరిపోగా - వెదకి దరిచేరి సమకూర్చినావు వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా ||కలువరి 3. మర్యమైన ఇహలోకమందే - నిత్య రాజ్యము నా కొసగినావు శక్తిగల నీ నామంబు నిరతం - భక్తితోనే ప్రకటింతు దేవా ||కలువరి||

bandhinaipoya neelo munigi teelaaka బంధినైపోయా నీలో మునిగితేలాకా

యేసయ్య నిన్నే సేవింతును ఆరదింతును... స్తుతింతునూ... (2) బంధినైపోయా నీలో మునిగితేలాకా.. నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ.. ఓ.(2) యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. చరణం:1 నను వీడని నీ ప్రేమను.. యడబాయని నీ కరుణను.. వెన్నంటి ఉండే కృపలను.. వర్ణించగలనా...(2) బంధినైపోయా నీలో మునిగితేలాకా.. నావల్ల కాదయ నిను వీడి ఉండుట...(2) యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. చరణం: 2 నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవ జలముతో.. నిను మహిమపరతును..(2) బంధినైపోయా నీలో మునిగితేలాకా.. నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ ఓ.(2) యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. Bridge: నీలో మునిగి తేలాక... నే విడుదలనే పొంద.. నీలో మునిగి తేలాక... నే ఉప్పొంగిపోయా.. నీలో మునిగి తేలాక... నే జీవమునే పొంద... నీలో మునిగి తేలాక... నే బంధినైపోయా.. (2) యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. Ad-Libs.. నీ మునిగి తేలాను,నీ ప్రేమలో.. నే బంధినైపోయాను, నీ ప్రేమకు.. విడులనేపొంద.. జీవమునే పొందాను...

kristu nedu puttene rakshana dorike క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికె

క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే (2) చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె (2) మా మంచి రాజు మనసున్న యేసు మాకై నేడు పుట్టెను చూడు ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం (2) 1. ఆహా ఆ . . చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను (2) 2. ఆహా ఆ . . ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని తార వార్త తెలిపెను జ్జానులారాధించెను (2)

neelone anandham naa deva నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

Image
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్

melu cheyaka neevu undalevayyaa మేలు చేయక నీవు ఉండలేవయ్యా

Image
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో , Siluvalo aa siluvalo aa gora kalvarilo

Image
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) 1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు (2) కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు 2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2) దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా 3. నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్ నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను