Posts

Showing posts with the label Telugu Christian Songs

lechinadayya maranapu mullu లేచినాడయ్య మరణపు ముల్లు

Image
లేచినాడయ్య మరణపు ముల్లు విరచి లేచినాడయ్య ॥2॥ పరమతండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమాస్వరూపుడై లేచినాడయ్య ॥2॥ విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై ॥2॥ క్రీస్తు లేచెను హల్లెలూయ సాతాను ఓడెను హల్లేలూయ క్రీస్తు లేచెను హల్లెలూయ మరణాన్ని గెలిచెను హల్లేలూయ ॥లేచినాడయ్య॥ శ్రమలనొందెను సిలువ మరణమొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగిలేచెను ॥2॥ విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై ॥2॥ క్రీస్తు లేచెను హల్లెలూయ సాతానుఓడెను హల్లేలూయ క్రీస్తు లేచెను హల్లెలూయ మరణాన్ని గెలిచెను హల్లేలూయ ॥లేచినాడయ్య॥ జీవమార్గము మనకు అనుగ్రహించెను మనపాపములన్నియు తుడిచివేసెను ॥2॥ ప్రేమయై మనకుజీవమై వెలుగునై మంచికాపరియై ॥2॥ క్రీస్తు లేచెను హల్లెలూయ సాతానుఓడెను హల్లేలూయ క్రీస్తు లేచెను హల్లెలూయ మరణాన్ని గెలిచెను హల్లేలూయ ॥లేచినాడయ్య॥

punarudhanuda naa yesayya పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

Image
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా

yudaa raja simham యూదా రాజ సింహం తిరిగి లేచెను

Image
యూదా రాజ సింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యూదా రాజ సింహం యేసు ప్రభువే యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను యూదా రాజ సింహం తిరిగి లేచెను 1. నరక శక్తులన్ని ఓడిపోయెను     ఓడిపోయెను అవన్ని రాలిపోయెను (2)     యూదా రాజ సింహం తిరిగి లేచెను 2. యేసు లేచెనని రూఢియాయెను     రూఢియాయెను సమాధి ఖాళీ ఆయెను (2)     యూదా రాజ సింహం తిరిగి లేచెను... 3. పునరుత్థానుడింక మరణించడు     మరణించడు మరెన్నడు మరణించడు (2)     యూదా రాజ సింహం తిరిగి లేచెను     తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను     యూదా రాజ సింహం తిరిగి లేచెను... 4. యేసు త్వరలో రానైయున్నాడు       రానైయున్నాడు మరల రానైయున్నాడు (2)      యూదా రాజ సింహం యేసు ప్రభువే      యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను      యూదా రాజ సింహం తిరిగి లేచెను

viluveleni naa jeevitham nee chethilo padagaane విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే

Image
విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే (2) ||నీది|| సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||

neelo samasthamu saadhyame నీలో సమస్తము సాధ్యమే

Image
నీలో సమస్తము సాధ్యమే (2) మహొన్నతుడా యేసయ్యా బలవంతుడా యేసయ్యా (2) ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4) ||నీలో|| అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2) ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా|| శోధన వేదనలలో జయమిచ్చువాడవు బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2) నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2) ||మహొన్నతుడా||