sudhooramu ee payanamu mundu iruku maargamu సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము

సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము||

అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||

హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||

నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||

Comments

Popular posts from this blog

மனசெல்லாம் மெல்ல மெல்ல மரியே உன் பேரைச் சொல்ல Manasellam mella mella maraiaye un Perai Solla

இறைவனிடம் பரிந்து பேசும் புனித அந்தோணியிரே -Iraivanidam Parinthu Pesum Punitha Anthoniyarey

இறை அன்னையை நோக்கிப் புனித பெர்நார்துவின் மன்றாட்டு