sathakoti vandhanaalu na yesayya శతకోటి వందనాలు నా యేసయ్యా
శతకోటి వందనాలు నా యేసయ్యా
నూతన బలము నూతన శక్తి
మా కొసగుమయ్యా
ఎనలేని నీ ప్రేమను మాపై
చూపించుమయ్యా
శ్రమలు శోధనలు ఇరుకు ఇబ్బందులు
ఎన్నెన్నో కలిగి కన్నీరు విడిచిన
కన్నీరు నాట్యముగ మార్చివేసినావు
మాతోడు నీవై నడిపించినావు
ఆత్మీయ యాత్రలో అలసిపోయిన
నీ శక్తితో నింపి బలపరచినావు
పక్షిరాజువలె నన్ను పైకెగరజేసి
ఆకాశవీధిలో విహరింపజేశావు
దినములు జరుగుచుండగ నీ కార్యములు
నూతనపరచుము నా యేసయ్యా
ఈ సమయములో మెండైన దీవెనలు
కురిపించుమయా కృపగల దేవా
Comments