galaleeya teerana chinna nava గలిలయ తీరాన చిన్ననావ

గలిలయ తీరాన చిన్ననావ
యేసయ్య ఏర్పరచు కున్ననావ
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా

1॰
యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించినా
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసినా
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా

2॰
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్లోచ్చినా
ఆగకుండా ముందుకే కొనసాగినా
అలుపెరుగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా

Comments

Popular posts from this blog

மனசெல்லாம் மெல்ல மெல்ல மரியே உன் பேரைச் சொல்ல Manasellam mella mella maraiaye un Perai Solla

இறைவனிடம் பரிந்து பேசும் புனித அந்தோணியிரே -Iraivanidam Parinthu Pesum Punitha Anthoniyarey

இறை அன்னையை நோக்கிப் புனித பெர்நார்துவின் மன்றாட்டு