sharonu vanamulo pusina pushpamai షారోను వనములో పూసిన పుష్పమై లోయ

షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని

1. సుకుమారమైన వదనము నీది - స్పటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాతల సవ్వడి వినగా - నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా !!షారోను!!

2. సర్వొన్నతమైన రాజ్యము నీది - సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులను చూడగా - నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా !!షారోను!!

3. సాత్వికమైన పరిచర్యలు నీవి - సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమలించు పుష్పమునై చూపనా - ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
ప్రభువా కృపతో నింపుమా !!షారోను!!

Comments

Popular posts from this blog

மனசெல்லாம் மெல்ல மெல்ல மரியே உன் பேரைச் சொல்ல Manasellam mella mella maraiaye un Perai Solla

இறைவனிடம் பரிந்து பேசும் புனித அந்தோணியிரே -Iraivanidam Parinthu Pesum Punitha Anthoniyarey

இறை அன்னையை நோக்கிப் புனித பெர்நார்துவின் மன்றாட்டு